
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్‌ల పంచాదీ ఇప్పట్లో సమసిపోయేటట్లు లేదు. బీజేపీ శాసన సభ్యులు రఘునందన్ రావు మొదలెట్టిన ఈ పంచాయితీకి ఫుల్‌స్టాప్ పడేటట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఈ ఇష్యూ మంత్రి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్యే రఘునందన్ మధ్య జరిగింది.
కానీ,ఇప్పడు ఇందులోకి సీఎం కేసీఆర్ కూడా ఏంట్రీ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్‌లపై రఘునందన్ మాట్లాడిదానికి ఎందుకు స్పందించారని మినిస్టర్ నిరంజన్‌కు సీఎం కేసీఆర్ క్లాస్ పీకారంటా..! మీరు స్పందించడం వల్ల ఈ వ్యవహారం మరింత పెద్దగా మరిందని చెప్పారంటా..! ఊరుకుంటే పోయే వ్యవహారాన్ని పట్టుకొని మరింత పెంట ఎందుకు చేశారని మంత్రిపై గుస్సా అయ్యారంటా..!
అయితే ఈ వ్యవహారంలో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. తాను మాట్లాడకపోతే ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడిందే నిజమని పబ్లిక్ నమ్మే అవకాశముందని వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. నిరంజన్ స్పందన ఎలా ఉన్నా..కేసీఆర్ మాత్రం ఈ అంశంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మినిస్టర్ నిర్వహక వల్ల వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీపై పబ్లిక్‌లో నెగటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ మథనపడుతున్నారంటా..! అయితే కేసీఆర్ ఆలోచన ఎలా ఉన్నా… శుక్రవారం మధాహ్నాం ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ స్టేట్ ఆఫీసులో మళ్లీ ప్రెస్‌మీట్ ముఖ్యమంత్రిని తూర్పార పట్టడం విశేషం.






