
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు దాంతో హుటాహుటిన సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. జానారెడ్డికి అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుపోయినట్లు గుర్తించి స్టెంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
జానారెడ్డికి ఎలాంటి ప్రాణాపాయం లేదని ధ్రువీకరించారు వైద్యులు. జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. జానారెడ్డికి గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు జానారెడ్డి.






