
రాయలసీమలో నాకు తిరుగులేదు అని భావిస్తున్న జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు రాయలసీమ పట్టభద్రులు. మరో బిగ్ షాకింగ్ ఏంటంటే …….. జగన్ సొంత జిల్లా కడప కూడా ఈ లిస్ట్ లో ఉండటం మరింత షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఏకంగా మూడు స్థానాలను గెలవడం సంచలనంగా మారింది.
పశ్చిమ రాయలసీమ స్థానంలో అధికార పార్టీకి చెందిన రవీంద్రా రెడ్డికి టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి కి మధ్య విజయం దోబూచులాడింది. చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లతో సంచలన విజయం అందుకున్నాడు టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి. దాంతో జగన్ ఖంగుతిన్నాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మూడు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడంతో జగన్ తట్టుకోలేక పోతున్నాడట. రాయలసీమ వాసులు అందునా సొంత జిల్లా కడప జిల్లా వాసులు కూడా తనకు షాక్ ఇవ్వడం ఏంటి ? అని మదన పడుతున్నాడట వైసీపీ అధినేత జగన్.
ఇక ఈ విజయాలు అస్సలు ఊహించలేదు తెలుగుదేశం పార్టీ. పేరుకు అభ్యర్థులను పోటీలో నిలబెట్టింది కానీ గతకొంత కాలంగా వైసీపీ సాగిస్తున్న ఆగడాలను చూసి ఈ ఎన్నికలు కూడా వైసీపీకి పట్టం కట్టడం ఖాయమని అనుకున్నారు. అయితే అనూహ్యంగా …… టీడీపీ పెద్దగా ప్రచారం చేయకపోయినా మూడు చోట్ల టీడీపీ కి పట్టభద్రులు విజయం కట్టబెట్టడం చూస్తుంటే తమకే షాకింగ్ గా ఉందని , ఇది ప్రజల మూడ్ ను స్పష్టం చేస్తోందని ….. ఇక రాబోయే రోజుల్లో ఈ విజయం స్పూర్తితో పని చేయాలని భావిస్తున్నారు.