
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. రియాక్టర్ పేలే సమయంలో 70 మంది కార్మికుల వరకు లోపల ఉన్నారు. రియాక్టర్ పేలిన సమయంలో అక్కడికక్కడే ఒకరు చనిపోగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
భారీ విస్ఫోటనం జరగడంతో భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. దట్టంగా పొగలు అలుముకోవడంతో గాయపడిన కార్మికుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మృతుల సంఖ్య కూడా మరింతగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.