హైదరాబాద్ లోని బంజారాహిల్స్ సినీ మ్యాక్స్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్క్ లేటర్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది దాంతో ఎస్క్ లేటర్ పై ఉన్న విద్యార్థులంతా కిందపడిపోయారు. దాంతో పదిహేను మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు కావడంతో ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ చిత్రాన్ని స్టూడెంట్స్ కు ఉచితంగా ప్రదర్శిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ లోని సినీ మ్యాక్స్ లో ప్రదర్శన కోసం స్టూడెంట్స్ రాగా ఈ సంఘటన జరిగింది. దాంతో స్టూడెంట్స్ భయాందోళనకు గురయ్యారు.