
వైశాలి కేసులో నిందితుడు నవీన్ రెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ఆది భట్ల లో వైశాలి ఇంట్లో కి వెళ్లి 100 మంది అనుచరులతో నానా హంగామా చేసి భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్న నవీన్ రెడ్డి ….. ఆ తర్వాత భయానికి లోనై గోవా పారిపోయాడు. దాంతో ఆది భట్ల పోలీసులు నవీన్ రెడ్డి ని అరెస్ట్ చేయాలని భావించిన పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గోవాలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి నవీన్ రెడ్డి ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తీసుకొస్తున్నారు.