
తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి AVN రెడ్డి విజయం సాధించాడు. దాంతో అతడి విజయం తెలంగాణలో చారిత్రాత్మకం అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు తెలంగాణలో బీజేపీ నాయకులకు ఇది సరికొత్త జోష్ ను అందిస్తోంది.
బీజేపీ శ్రేణులకు అలాగే బండి సంజయ్ ని అభినందిస్తూ అమిత్ షా ట్వీట్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ , రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి AVN రెడ్డి పోటీ చేయగా బీజేపీ మద్దతు ఇచ్చింది. టీచర్స్ ఎమ్మెల్సీ కావడంతో అధికార BRS మద్దతు పలికిన వ్యక్తి గెలుస్తాడని అనుకున్నారు అందరు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ టీచర్స్ బీజేపీ అభ్యర్థిని గెలిపించడం విశేషం. బీజేపీ విజయంతో గులాబీ దళంలో కలవరం మొదలైంది.