
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మాజీ మంత్రి , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో సమావేశమయ్యారు. శామీర్ పేటలోని ఈటల ఇంటికి వెళ్లారు అమిత్ షా. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఈటల రాజేందర్ ను పరామర్శించడానికి శామీర్ పేటకు వెళ్లారు. అక్కడ దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి. అందులో 15 నిమిషాల పాటు ఈటల రాజేందర్ తో ఏకాంతంగా సమావేశమయ్యారు అమిత్ షా. ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.