కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా హాజరవ్వడం విశేషం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపినప్పటికీ కేసీఆర్ హాజరు కాలేదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరుపున ఏ మంత్రి కూడా పాల్గొనలేదు.
ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కిషన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించాడు. అమిత్ షా కు ఘనస్వాగతం లభించింది. కర్ణాటక , మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు తమ విద్యలను అమిత్ షా ముందు ప్రదర్శించారు. అంతకుముందు అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.