
తెలంగాణ పోలీస్ కొత్త బాస్ గా అంజనీ కుమార్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. డీజీపీ పి. మహేందర్ రెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త పోలీస్ బాస్ గా అంజనీ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంజనీ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. 1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీ కుమార్ ప్రస్తుతం ఏసీబీ డీజీ గా పని చేస్తున్నారు. తెలంగాణలో జనగామ , నిజామాబాద్ , హైదరాబాద్ , వరంగల్ లలో వివిధ హోదాలలో పనిచేసారు. ఇప్పుడు పదోన్నతి పొంది పోలీస్ బాస్ గా నియమితులయ్యారు.