ఆదివారం రోజున నాలుగేళ్ళ బాలుడిపై ఓ ఆరు కుక్కలు దాడి చేసి చంపిన ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచి వేసింది. హైదరాబాద్ మహానగరంలో కలకలం సృష్టించిన ఈ సంఘటన మరిచిపోకముందే మరో సంఘటన తీవ్ర దుమారాన్ని రేపింది. అంబర్ పేట ఘటన మరిచిపోకముందే దిల్ షుఖ్ నగర్ లోని చైతన్యపురిలో మరో సంఘటన జరిగింది.
నాలుగేళ్ళ బాలుడిపై కుక్కల దాడి జరిగింది. చైతన్యపురి లోని ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ళ బాలుడి మీదకు ఒక్కసారిగా కుక్కల గుంపు వచ్చింది. ఆ బాలుడు భయపడి పారిపోతున్నప్పటికీ కుక్కలు దయ , జాలి చూపించలేదు. మీదపడి దాడి చేసాయి. అయితే సమీపంలో ఉన్నవాళ్లు కుక్కలను తరమడంతో ఆ బాలుడు గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మహానగరంలో కుక్కల దాడులు వరుసగా జరుగుతుండటంతో తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు ప్రజలు.