తన కూతురు పెళ్ళికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. గత మూడు రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. దాంతో ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాడు కేసీఆర్.
ఇక ఇదే సమయంలో ఢిల్లీ లోని కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు ఎం ఐ ఎం అధినేత , హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ. తన కూతురు పెళ్లికి కేసీఆర్ ను ఆహ్వానిస్తూ పెళ్లి ఆహ్వాన పత్రిక అందించాడు. ఒవైసీ – కేసీఆర్ ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దాంతో తప్పకుండా వస్తానని హామీ ఇచ్చాడు కేసీఆర్.