
బ్రేకింగ్ న్యూస్ …… టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1 నిందితుడిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ను పేర్కొనడం సంచలంగా మారింది. తెలంగాణలో 10 వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆ పేపర్లు లీక్ కావడానికి బండి సంజయ్ కారకుడని , ప్రభుత్వ కూల్చివేతకు బండి సంజయ్ కుట్ర పూరితంగా వ్యవహరించాడని తెలంగాణ పోలీసులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి బండి సంజయ్ ని కరీంనగర్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుండి బండి సంజయ్ ని విభిన్న మార్గాలలో హనుమకొండకు తీసుకొచ్చారు పోలీసులు. ప్రతీ చోట కూడా బండి సంజయ్ ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడానికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాంతో చాలా చోట్ల లాఠీచార్జి చేశారు పోలీసులు






