
10 th పేపర్ లీకు కావడానికి బండి సంజయ్ కారణమని సంచలన ఆరోపణలు చేస్తున్నారు అధికార BRS మంత్రులు , ఎమ్మెల్యేలు. ఇక పోలీసులు కూడా ఇదే విషయంలో అరెస్ట్ చేశామని , కొద్దిసేపట్లోనే మీడియా ముందుకు తగిన సాక్ష్యాధారాలతో వస్తామని చెప్పడం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి బండి సంజయ్ , బీజేపీ ఆడుతున్న దుర్మార్గపు క్రీడఅని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు BRS మంత్రులు , ఎమ్మెల్యేలు.
ఏప్రిల్ 3 న పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 3 న తెలుగు పేపర్ లీక్ కాగా ఏప్రిల్ 4 న హిందీ పేపర్ కూడా లీక్ అయ్యింది. అయితే హిందీ పేపర్ ను ఒక జర్నలిస్ట్ బండి సంజయ్ కు వాట్సాప్ లో పంపించాడు. ఇంకేముంది ఈ లీకుల వెనుక బండి సంజయ్ ఉన్నాడని ఆరోపిస్తూ నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసారు.






