అమిత్ షా కు చెప్పులు అందించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ బండి సంజయ్ పై తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు ట్వీట్ కూడా చేసి అది వైరల్ అయ్యేలా చేసాడు కేటీఆర్. అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎట్టకేలకు బండి సంజయ్ స్పందించాడు.
మేము చెప్పులు అందిస్తే తప్పేంటి ? నేనేమి మోకరిల్లలేదు కదా ! ప్రణబ్ ముఖర్జీ , నరసింహన్ కాళ్ళు మొక్కాడు కేసీఆర్ మరి దానికి ఏమంటారు అంటూ ప్రశ్నించాడు బండి సంజయ్. ప్రణబ్ ముఖర్జీ , నరసింహన్ కాళ్ళు మొక్కిన కేసీఆర్ రామ్ నాధ్ కోవింద్ కాళ్ళు ఎందుకు మొక్కలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతేకాదు ఢిల్లీలో మద్యం స్కామ్ కు కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయని ముందు దానికి సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ ని ప్రశ్నించాడు బండి సంజయ్.