
బండి సంజయ్ వ్యాఖ్యలు బాధాకరం అంటూ వ్యాఖ్యానించింది ఎమ్మెల్సీ కవిత. బీజేపీలో మహిళలకు గౌరవం లేదని , వాళ్ళు మహిళలను కించపరుస్తూనే ఉంటారని , మోడీ కూడా మమతా బెనర్జీని అవమానించాడని అలాగే ఇక్కడ బండి సంజయ్ నన్ను అవమానిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కానీ అసభ్యకరంగా , అవహేళనగా చేస్తూ మాట్లాడటం సరైంది కాదని హితువు పలికింది కవిత.
తెలంగాణలో తెలంగాణ జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తామని , అయితే దేశ వ్యాప్తంగా మాత్రం భారత జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని , ఇప్పటికే భారత్ జాగృతి పేరును రిజిస్టర్ చేయించామని స్పష్టం చేసింది. భారత్ రాష్ట్ర సమితిలో కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించింది.