
JSW & జైస్వరాజ్య యూట్యూబ్ ఛానల్ కోసం ” బతుకమ్మ ” పాటను చిత్రీకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లోని శివాలయంలో అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో బతుకమ్మ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. మహిళలతో పాటుగా మహేశ్వరం కు చెందిన పలువురు యువతీయువకులు కూడా పాల్గొన్నారు. బతుకమ్మ తెలంగాణలో పెద్ద పండగ ,అలాగే ఎంతో విశిష్టమైన పండగ దాంతో భక్తి శ్రద్దలతో ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇక ఈ బతుకమ్మ పాట JSW క్రియేటివ్ హెడ్ జగన్ సూదినేని ఆధ్వర్యంలో జరిగింది.