
హైవే రోడ్డు ఉంది కదా ! అని అత్యంత వేగంతో దూసుకువెళ్లడమే పనిగా పెట్టుకుంటారు కుర్రాళ్ళు. అయితే ఎంత వేగంగా వెళ్లాలని అనుకుంటామో ….. ఆ వేగమే మనుషుల ప్రాణాలను హరిస్తోంది. హైవేల పై తరచుగా ఇలాంటి యాక్సిడెంట్ లు ప్రతీ రోజూ జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అత్యంత వేగం …… ఆ వేగం వల్ల టైర్లు తీవ్ర ఒత్తిడికి గురై బరస్ట్ అవుతున్నాయి. మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి.

సంతోషంగా రైడింగ్ కు వెళ్లిన వాళ్ళు అర్దాంతరంగా తనువు చాలిస్తుండటంతో …… అధునాతనమైన మన జాతీయ రహదారులు రక్తమోడడానికి కారణాలు వెదుకుతున్నారు. ఇంతకీ పెద్ద ఎత్తున రోడ్ యాక్సిడెంట్ లు జరగడానికి అలాగే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడానికి కారణం ఏంటో తెలుసా ……. ఆయా వాహనాలకున్న టైర్లు కారణం.

టైర్ లలో సాధారణంగా 25 psi చొప్పున గాలి ఉండాలి. అయితే మన ఇండియన్ రోడ్ల మీద మాత్రం 35 – 45 psi చొప్పున గాలి ఫిల్ చేయిస్తారు. అయితే హైవే రోడ్ల మీద అత్యంత వేగంగా వెళ్లడంతో తరచుగా బ్రేక్ లు వేస్తూ ఉండటంతో అవి తీవ్ర ఒత్తిడికి లోనౌతాయి. ఆ సమయంలో టైర్లలోని గాలి ఒత్తిడి 50 కి పైగా చేరుకుంటుంది. అదేంటీ మనం పెట్టించిన గాలి తక్కువ కానీ ఇలా అధికంగా ఉండటం ఏంటి ? అని అనుకుంటున్నారా అది తీవ్ర ఒత్తిడి వల్ల ఏర్పడుతుంది. దాంతో టైర్లు పగిలిపోయి భారీ యాక్సిడెంట్ లు అవుతున్నాయి……. మనుషుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. హైవే పై ప్రయాణించే వాళ్ళు గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోవాలి అంతేకాని అదే మన చివరి గమ్యం కాకూడదు. అందుకోసం టైర్ల విషయంలో అలాగే వేగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ……. నిపుణుల సలహాలు పాటిస్తే ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది…… సరికొత్త జీవన గమనానికి నాంది పలుకుతుంది.