బ్రేకింగ్…… ఈడీ విచారణకు డుమ్మా కొట్టింది ఎమ్మెల్సీ కవిత. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సిన కవిత తాను విచారణకు హాజరు కావడం లేదని, అనారోగ్యంతో బాధపడుతున్నానని తన ప్రతినిధి సోమా భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపించింది. అనారోగ్య కారణాల వల్ల అలాగే సుప్రీంకోర్టు లో పిటీషన్ వేసినందువల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి తెలిపింది. అయితే అందుకు ఈడీ నిరాకరించింది. దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.