
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో క్షణానికో వింత జరుగుతోంది. ఈడీ విచారణకు ఈనెల 11 న హాజరైన కవిత 16 న మాత్రం డుమ్మా కొట్టింది. ఈడీ విచారణ తీరు సరిగా లేదని తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ఈనెల 24 న విచారణ చేస్తామని చెప్పింది. అయితే మార్చి 16 న విచారణకు రాకపోవడంతో ఈనెల 20 న విచారణకు రావాల్సిందిగా కోరుతూ ఈడీ కొత్త నోటీసులు జారీ చేసింది. దాంతో ఈనెల 20 న ఈడీ విచారణకు హాజరు కాకుండా ఉండటానికి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లుగా లీకులు ఇచ్చారు కవిత టీమ్.
దాంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అంతేకాదు సుప్రీంకోర్టు కవిత రిట్ పిటీషన్ ను తోసిపుచ్చినట్లుగా కథనాలు వెలువడ్డాయి. కట్ చేస్తే కవిత ట్వీట్ చూసి షాక్ అవ్వడం మీడియా వంతు అయ్యింది. నేను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా , సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్లుగా కథనాలు వచ్చాయని కానీ అవన్నీ అవాస్తవమని ఎందుకంటే నేను మళ్ళీ కోర్టును ఆశ్రయించలేదని ట్వీట్ చేసింది కవిత. దాంతో షాక్ అవ్వడం మీడియా వంతు అయ్యింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈనెల 20 న కవిత తప్పకుండా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈడీ ముందుకు వస్తుందా ? మళ్లీ ఆమె లాయర్లు ఏదైనా ప్లాన్ వేశారా ? అన్నది ఈనెల 20 న తేలనుంది.
గౌరవ సుప్రీం కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. నేను ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. https://t.co/q8x3wkRKzV
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 17, 2023