తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసారు దాంతో కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు బండి సంజయ్. కేసీఆర్ నీకు దమ్ముంటే ……నువ్ మొగోడివైతే నాతో రాజకీయం చెయ్ …… అంతేకాని పిల్లల జీవితాలతో ఆడుకొవద్దు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు బండి సంజయ్.
కుత్బుల్లాపూర్ బహదూర్ పల్లిలోని మహేంద్ర వర్శిటీలో బిటెక్ చదువుతున్నాడు బండి సంజయ్ కుమారుడు. అయితే తన స్నేహితుడి చెల్లెలును ఓ మరో స్టూడెంట్ ఆట పట్టించడంతో ఆ స్టూడెంట్ ను కొట్టాడు బండి సంజయ్ కొడుకు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న సదరు స్టూడెంట్ తప్పంతా నాదేనని ఓ వీడియో కూడా పెట్టాడు. అయితే అకస్మాత్తుగా దుండిగల్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదు అయ్యింది.
తన కొడుకు పై కేసు నమోదు కావడంతో ముగ్గురు పిల్లల జీవితాలతో ఆడుకుంటావా ? పిల్లలు కొట్టుకుంటారు ….. తర్వాత కలుసుకుంటారు. అయినా తప్పు చేసిన స్టూడెంట్ తప్పంతా నాదేనని ఒప్పుకున్నాడు ……. వివాదం సద్దుమణిగింది కదా ! ఇప్పుడు కేసు ఎవరు పెట్టారు ? ఎందుకు పెట్టారు ? మీరు చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడతావా ? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పుల వర్షం కురిపించాడు బండి సంజయ్.