కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు , బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసారు పోలీసులు. కేసీఆర్ సర్కార్ సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా జనగామలోని పామునూర్ వద్ద ధర్నాకు దిగడంతో తెలంగాణ పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసారు. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర పై దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా అరెస్ట్ చేశామని అంతేకాని మరో కారణం లేదని అంటున్నారు పోలీసులు.
బండి సంజయ్ కు భద్రత కల్పిస్తామని పోలీసులు చెప్పడంతో కేసీఆర్ సర్కార్ పోలీసులు నాకు అవసరం లేదంటూ భద్రతను తిరస్కరించాడు బండి సంజయ్. దాంతో పోలీసులు అరెస్ట్ చేసారు. బండి సంజయ్ గతకొంత కాలంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రలో కేసీఆర్ సర్కారుపై అలాగే కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు దాంతో బండి సంజయ్ పై దాడులు జరగొచ్చని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేసాయి.
Breaking News