బ్రేకింగ్ న్యూస్……. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై రాళ్ళ దాడి జరిగింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కు దిగాడు బండి సంజయ్. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్చడం వల్ల వందలాది రైతుల భూములు కోల్పోతుండటంతో రైతులు ఆందోళన చేపట్టారు. వాళ్లకు మద్దతుగా బండి సంజయ్ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం కు వచ్చాడు. అయితే బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.
దాంతో పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు కార్యకర్తల తోపులాట ఎక్కువ కావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భావించిన పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో బండి సంజయ్ వాహనంపై రాళ్ళ దాడి జరిగింది. ఆ రాళ్ళ దాడిలో పోలీసులు వాహనం ధ్వంసం అయ్యింది.