
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా అంబర్ పేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. కార్యకర్తలు సంతోషంగా ఎయిర్ బెలూన్ లు అలాగే బాణాసంచా ఏర్పాటు చేశారు. బాణసంచా కాల్చుతున్న సమయంలో ఎయిర్ బెలూన్ లకు తగిలి అవి ఒక్కసారిగా పేలాయి. దాంతో ఆ పేలుళ్లకు భయపడిన కార్యకర్తలు పరుగు అందుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా పరుగు అందుకునే క్రమంలో కిందపడ్డాడు. దాంతో ఎమ్మెల్యే తో పాటుగా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన ఎమ్మెల్యే ను అలాగే కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు.