
నిర్మల్ మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేదు లేదంటూనే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పీసీసీ క్రమశిక్షణా కమిటీ తనకు నోటీసులు జారీ చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహేశ్వర్ రెడ్డి ఈరోజు హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో సమావేశమై అక్కడే తేల్చుకుంటానని చెప్పిన నేత ఖర్గే ను కలవకుండా బీజేపీ తెలంగాణ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో చర్చలు జరిపాడు.
అనంతరం బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్ తో సమావేశం అవుతున్నాడు. ఇక జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డి తన ఆలోచనలు , డిమాండ్లు తరుణ్ చుగ్ ముందు పెట్టనున్నట్లు సమాచారం. ఈరోజు మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా పార్టీలోకి తీసుకోవడంపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు.






