బ్రేకింగ్ న్యూస్……. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 7 న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ లకు చివరి తేదీ అక్టోబర్ 14 . ఇక నవంబర్ 3 న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 6 న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సందర్భంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పోటీలో దిగుతోంది. ఇక అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అన్నది ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటించనున్నారు.