
భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. జనవరి 18 న ఖమ్మం లో భారీ ఎత్తున BRS ఆవిర్భావ సభ నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ , కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ , ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లతో పాటుగా పలువురు నాయకులు పాల్గొననున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత పెడుతున్న భారీ బహిరంగ సభ కావడంతో 5 లక్షలకు తక్కువ కాకుండా జనాలను తరలించాలని భావించింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు , ప్రయివేట్ పాఠశాలల బస్సులను అలాగే ఇతర వాహనాలను ఏర్పాటు చేసారు. తెలంగాణ నలుమూలల నుండే కాకుండా ఏపీ నుండి కూడా పెద్ద ఎత్తున జనాలను తరలించడానికి భారీ ఏర్పాట్లు చేసారు. రేపు ఖమ్మంలో అంగరంగ వైభవంగా BRS ఆవిర్భావ సభ జరుగనుంది. మోడీని గద్దె దించాలంటే అది ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందని చాటి చెప్పడమే ఈ మీటింగ్ లక్ష్యంగా కనబడుతోంది.