మంత్రి మల్లారెడ్డి పై ఐదుగురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం నామినేట్ పదవులన్నీ తన వర్గానికి మాత్రమే ఇచ్చుకుంటూ మమ్మల్ని అవమానిస్తున్నాడని , అలాగే జిల్లాలో ఎక్కడ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ పాటించడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు ఐదుగురు ఎమ్మెల్యేలు వివేకానంద , మైనంపల్లి హన్మంతరావు , మాధవరం కృష్ణారావు , అరికెపూడి గాంధీ, భేతి సుభాష్ రెడ్డి
ఈరోజు ఉదయం మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశం కావడం రాజకీయంగా వేడి పుట్టించింది. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో కార్యకర్తలకు ఎలాంటి సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి కేటీఆర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తామని , అవసరమైతే అధినేత కేసీఆర్ ను కూడా కలుస్తామని అంటున్నారు. మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎక్కడా తగ్గేదేలే అని అంటున్నారు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు. మరి BRS అధ్యక్షుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.