
ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అధికార BRS పార్టీ. అందుకే పెద్ద ఎత్తున ఢిల్లీకి మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు వెళ్తున్నారు. కవిత ను అరెస్ట్ చేశామని ప్రకటించడమే ఆలస్యం ఈడీ ముందు ధర్నా చేయాలని డిసైడ్ అయ్యిందట గులాబీ దళం. అసలు నిన్నటి వ్యూహం ప్రకారం ఢిల్లీకి కేటీఆర్ ఒక్కడే వెళ్ళాలి కానీ హరీష్ రావు కూడా వెళ్ళాడు.
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. అలాగే కవిత అరెస్ట్ కావడం పక్కా అని పక్కా సమాచారం గులాబీ అధినేత కేసీఆర్ కు తెలియడంతో పెద్ద ఎత్తున మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ముఖ్య నాయకులు ఢిల్లీ తరలి వెళ్తున్నారు. ఢిల్లీ లో తీవ్ర ఆందోళన చేయడం ద్వారా జాతీయ మీడియా అటెన్షన్ కొట్టేయ్యొచ్చని అలాగే తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించ వచ్చని, ఇక మహిళను మోడీ ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని చాటి చెప్పినట్లు అవుతుందని భావిస్తున్నారు. అలాగే రాజకీయంగా కూడా ప్రయోజనం చేకూరుతుందని గులాబీ దళపతి వ్యూహం పన్నుతున్నారని సమాచారం.