నల్గొండ జిలాల్లో బస్సు దగ్దమైంది. అయితే ఈ ఘటనలో ప్రయాణీకులు ఎవరు కూడా గాయపడలేదు దాంతో ఊపిరి పీల్చుకున్నారు. మార్నింగ్ డీలక్స్ అనే కంపెనీకి చెందిన ఏసీ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ బయలుదేరింది నిన్న రాత్రి. అయితే నల్గొండ జిల్లా దాటే సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణీకులను కిందికి దిగమని కోరాడు దాంతో ప్రయాణీకులంతా బస్సు దిగారు. కొద్దిసేపటికే బస్సు మొత్తం కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సు దగ్దమైందని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Breaking News