
బై బై మోడీ అంటూ హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కవిత మద్దతుదారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈరోజు కవితను ఢిల్లీలో ఈడీ ప్రశ్నించనుంది. ఈరోజు కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమెకు మద్దతుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు.
ED , CBI , BJP బెదిరింపులకు భయపడేది లేదంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. అంతేకాదు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ నేతల ఫోటోలను కూడా ముద్రించారు. జ్యోతిరాదిత్య సింథియా , హిమంత విశ్వకర్మ , సువెందు అధికారి , సుజనా చౌదరి , నారాయణ్ రాణే తదితరుల ఫోటోలు ముద్రించారు. వీళ్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే వాళ్ళు బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా లాగా స్వచ్ఛ నాయకులు ఎలా అవుతారు ? వాళ్లపై విచారణ సాగదా ? అంటూ ప్రశ్నిస్తోంది గులాబీ దళం.
బై బై మోడీ అంటూ హ్యాష్ ట్యాగ్ తో భారీ ఎత్తున ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ మహానగరంలోనే కాకుండా తెలంగాణ అంతటా ఈ పోస్టర్ లను ఏర్పాటు చేసింది గులాబీ దళం. కవిత విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.