బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది దాంతో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలు కాగా వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూ ఇయర్ జోష్ లో నిన్న రాత్రి పీకల దాకా తాగిన ఇద్దరు కారును అత్యంత వేగంగా నడిపారు. అసలే తాగి ఉన్నారు ఆపై కారు వేగంగా వెళ్తుండటంతో దాన్ని అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ బండిని బలంగా ఢీకొట్టారు. ఆ టిఫిన్ బండి ముందు ఉన్న నాలుగు కార్లు ధ్వంసం కాగా టిఫిన్ కోసం వచ్చిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. న్యూ ఇయర్ వేడుకలను అట్టహాసంగా చేసుకోవాలని ఆశపడిన వాళ్లకు జీవితంలో అత్యంత విషాదాన్ని నింపింది. యాక్సిడెంట్ కు పాల్పడిన ఇద్దరిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు.
Breaking News