సీనియర్ కాంగ్రెస్ నేత , భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. డాక్టర్ చెరుకు సుధాకర్ , ఆయన తనయుడు డాక్టర్ సుహాన్ ను బెదిరించిన కేసులో నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. చెరుకు సుధాకర్ తనయుడు డాక్టర్ సుహాన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై సెక్షన్ 506 తో పాటుగా పలు సెక్షన్ లతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు అయిన డాక్టర్ చెరుకు సుధాకర్ ను , ఆయన తనయుడు డాక్టర్ సుహాన్ ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బండబూతులు తిట్టిన ఆడియో అంటూ ఒకటి బాగా వైరల్ అయ్యింది. చెరుకు సుధాకర్ తో పాటుగా నిన్ను కూడా నా మనుషులు చంపేస్తారని బూతులు తిట్టాడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయితే నేను ఆవేశ పడిన మాట వాస్తవమే కానీ నేను మాట్లాడిన మాటలు కొన్ని కట్ చేసి కొన్ని మాత్రమే వినిపించారని , నన్ను అదేపనిగా బదనాం చేస్తుంటే నా అనుచరులు తట్టుకోలేకపోయారని , లక్షలాది మందికి సహాయం చేసిన కుటుంబం మాదని …… కొన్ని రోజులుగా చెరుకు సుధాకర్ అదేపనిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని దాంతో ఆవేశంలో ఏవో మాటలు దొర్లాయని వివరం ఇచ్చుకున్నాడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అయితే ఈ విషయంలో ఎవరు చెప్పినా తగ్గేది లేదని , నయీమ్ బెదిరింపులకే భయాపడలేదు నయీమ్ ఆవహించిన కోమటిరెడ్డి బెదిరింపులకు భయపడతానా ? కేసు విషయంలో తగ్గేది లేదని అంటున్నారు చెరుకు సుధాకర్ , చెరుకు సుహాన్.