
ఢిల్లీ లోని ఈడీ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్ విధించారు. అలాగే ఢిల్లీలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించారు. దాంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించడం అలాగే ఈడీ కార్యాలయం చుట్టూ అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం చుట్టూ పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించడంతో కవిత అరెస్ట్ ఖాయమంటూ సంకేతాలు వెలువడుతున్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం ఈరోజు లేదా రేపు కవితను అరెస్ట్ చేయడం ఖాయమని వినిపిస్తోంది. కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించడంతో గులాబీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కవితకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.