
ఏపీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డీజీ పై చర్యలు తీసుకున్న తర్వాత దానికి సంబందించిన పూర్తి నివేదిక కేంద్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది కేంద్రం. ఇక సునీల్ కుమార్ పై ఈ చర్యలు ఎందుకు కోరిందంటే ……. ఇటీవల అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికపై విద్వేష ప్రసంగం చేసాడు ఏపీ డీజీ సునీల్ కుమార్. దాంతో హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రసంగించిన సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది.