ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని నారా చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకోవడం , చర్చలు జరపడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక అధికార వైసీపీ కి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు- పవన్ లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పలు విమర్శలు చేస్తూ పోస్ట్ లు పెట్టారు వైసీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తులో ఉన్నాడు. అయితే ఏపీలో వైసీపీ ని ఓడించాలంటే బీజేపీ- జనసేన వల్ల కాదని భావించాడట పవన్ దాంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యాడని భావిస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని భావిస్తున్నారు. దాంతో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.