శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈరోజు నుండి పలు కష్టాలకు తెర పడనుంది. ఇంతకీ ఈరోజు నుండి ప్రారంభం కాబోయే వెసులుబాటు ఏంటో తెలుసా …… డిజి యాత్ర యాప్ . సాధారణంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణీకులకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. టికెటింగ్ దగ్గర , లగేజీ దగ్గర , డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించడానికి ప్రయాణీకులు ఎక్కువ సేపు క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. దాంతో ఇలా క్యూలో ఎక్కువ సేపు నిలబడే అవకాశం లేకుండా డీజీయాప్ ని అందుబాటులోకి తెచ్చింది.
డీజీ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న వాళ్ళు నేరుగా నిర్మినల్ కు వెళ్లి ఫేస్ రికగ్నిషన్ చేసుకొని హాయిగా విమానంలోకి వెళ్లొచ్చు. డీజీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల అందులో సంబంధింత వ్యక్తి ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ తో అనుసంధానం చేయడం ద్వారా డీజీ యాప్ ప్రయాణీకులకు మెరుగైన సౌలభ్యం అందించనుంది. ఈ డీజీ యాప్ ఇన్నాళ్లు ఢిల్లీ , బెంగుళూర్ , ముంబై లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇక ఈరోజు నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కూడా అందుబాటులోకి రానుంది.
Breaking News