తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతితో పాటుగా మరో ఇద్దరికీ బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు లో బెయిల్ పిటీషన్ పెట్టుకున్నారు. అయితే కేసు తెలంగాణ హైకోర్టు లో ఉన్నందున మధ్యలో జోక్యం చేసుకోలేని, హైకోర్టు లో విచారణ తర్వాత మాత్రమే తాము జోక్యం చేసుకోవాలా ? వద్దా ? అనే నిర్ణయం తీసుకోగలమని అయినా……. ఒకవైపు హైకోర్టు లో కేసు విచారణ సాగుతుండగానే సుప్రీం ను ఎందుకు ఆశ్రయించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకోవాలని నిందితులకు సూచించింది.