తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉన్నపటికీ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ఈరోజు కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు హైదరాబాద్ మహానగరంలో. కొత్తగా కడుతున్న సచివాలయంను పరిశీలించిన కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30 న కొత్త సచివాలయం ప్రారంభించబోతున్నట్లు స్ఫష్టం చేసారు.
అలాగే డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏప్రిల్ 14 న భారీ ఎత్తున నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం కావడంతో ఆ సందర్బంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న అమర వీరుల స్థూపాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.
కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , అధికారులు పాల్గొన్నారు. ఒకవైపు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో కేసీఆర్ సుడిగాలి పర్యటన మరింత వేడిని రాజేసింది.