
ఈరోజు ప్రగతి భవన్ లో TRS ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎంపీ , ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు అధినేత కేసీఆర్. దాంతో మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడేమో అనే కంగారు మొదలైంది రాజకీయ వర్గాల్లో. అయితే అలాంటి ఆలోచన ఏది లేదని కుండబద్దలు కొట్టాడు కేసీఆర్. మనకు ఇంకా 10 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు , పార్టీ నాయకులు అందరు కూడా ప్రజల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసాడు.
కవితను బీజేపీ లోకి రావాలని ఆ పార్టీ నేతలు అడిగారని , బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసాడు కేసీఆర్. మీరు కూడా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలని నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేసాడు. అంతేకాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజాబలం ఉన్న వాళ్ళను పార్టీలోకి తీసుకోవాలని సూచించాడు కేసీఆర్. ఇక మునుగోడులో టీఆర్ఎస్ కు మెజారిటీ తగ్గడం పట్ల మంత్రులపై అలాగే ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారట. తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2023 లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసాడట కేసీఆర్.