హైదరాబాద్ లో మరో నాలా కుంగిపోయింది. దాంతో నాలా మీద ఉన్న కార్లు , ఆటోలు , కూరగాయల బండ్లు , అలాగే కొంతమంది మనుషులు ఆ నాలా లో పడ్డారు. దాంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంచలన సంఘటన గోషా మహల్ లోని చాందన్ వాడి లో జరిగింది. ఈరోజు శుక్రవారం కావడంతో కూరగాయలు మార్కెట్ పెట్టారు. అందరూ రోడ్ల మీదనే మార్కెట్ పెట్టడం కామన్. దాంతో కొంతమంది నాలా మీదనే కూరగాయలు పెట్టుకున్నారు. సడెన్ గా నాలా కుప్పకూలడంతో అందులో పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Breaking News