గాంధీ భవన్ లో ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అనిల్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై అనిల్ తీవ్ర స్థాయిలో విమర్శించడం సరికాదన్నారు ఓయూ స్టూడెంట్స్. డిపాజిట్ కూడా దక్కించుకోలేని అనిల్ సీనియర్ నాయకులను ఎలా టార్గెట్ చేస్తారని , వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అనిల్ కూడా ఓయూ స్టూడెంట్స్ తో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర తోపులాట జరిగింది.
దాంతో ఒక్కసారిగా గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివాదం పెద్దది కాకముందే డాక్టర్ మల్లు రవి జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. దాంతో వాతావరణం చల్లబడింది. అయితే మాజీ ఎమ్మెల్యే అనిల్ తన పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు ఓయూ స్టూడెంట్స్. గాంధీభవన్ లోపల దిగ్విజయ్ సింగ్ చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ గొడవ జరగడం విశేషం.