Congress expelled Marri Shasidhar Reddyకాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ కాలం అనుబంధం ఉన్న నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి. అయితే అలాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు షాక్ అవుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించడానికి కారణం ఏంటో తెలుసా……. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించడమే.
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసాడు మర్రి శశిధర్ రెడ్డి . తెలంగాణ విడిపోకముందు పూర్వపు ఆంధ్రప్రదేశ్ లో మంత్రిపదవి కూడా చేపట్టాడు. అలాగే కేంద్రంలో కేబినెట్ హోదా కలిగిన చైర్మన్ పదవి కూడా చేపట్టాడు. సనత్ నగర్ స్థానం నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించాడు అప్పట్లో. అయితే ఇటీవల కాలంలో మర్రి శశిధర్ రెడ్డి వరుసగా ఓటమి పాలయ్యాడు. దాంతో కాంగ్రెస్ లో ప్రాధాన్యత తగ్గిపోయింది.
దానికి తోడు రేవంత్ రెడ్డి అంటే మర్రి శశిధర్ కు పడటం లేదు. ఇక ఇటీవలే బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసాడు. అలాగే కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించడంతో ఆగ్రహించి న అధిష్ఠానం మర్రి శశిధర్ రెడ్డిని ఆరేళ్ళ పాటు పార్టీ నుండి బహిష్కరించింది.