
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ ఖాయమా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల కాలంలో దేశంలో సంచలనంగా మారిన కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పటికే పది మందికి పైగా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కాగా నిన్న రాత్రి అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్ట్ చేసింది.
25 కోట్ల మేర నగదు బదిలీ అరుణ్ రామచంద్ర పిళ్ళై చేసినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ అతడ్ని అరెస్ట్ చేయడంలో ఎందుకు తాత్సారం చేసారు అంటూ జడ్జి ఈడీ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అతడ్ని పదేపదే విచారించాల్సిన అవసరం లేదని , నగదు బదిలీకి సంబందించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొనడంతో ఇక తదుపరి అరెస్ట్ ఎమ్మెల్సీ కవిత అనే వినబడుతోంది.
ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిళ్ళై నేను కవిత తరుపున ఈ డీలింగ్ లో పాల్గొన్నాను అని స్పష్టం చేసాడు కాబట్టి. అసలు ఎవరు ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై ? ఇతడికి కవిత కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి ? వ్యాపారవేత్త అయిన అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈ లిక్కర్ స్కామ్ కు ఉన్న సంబంధం ఏంటి ? అంటూ అతడి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. పిళ్ళై అరెస్ట్ తో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. దాంతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కవితను అరెస్ట్ చేస్తే ప్రతిఘటించడానికి , పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి అధికార BRS సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.