
లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత పేరు చార్జిషీట్ లో నమోదు చేసింది. ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన వాళ్లలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత , మాగుంట శ్రీనివాసులు రెడ్డి , మాగుంట రాఘవ రెడ్డి , శరత్ చంద్రా రెడ్డి లు ఉన్నారు. బుచ్చిబాబు , అభిషేక్ బోయినపల్లి , అరుణ్ రామచంద్ర పిళ్ళై లను తమ ప్రతినిధులుగా పేర్కొన్నారని ఈడీ ప్రస్తావించింది. అంతేకాదు కవిత పది ఐ ఫోన్ లను ధ్వంసం చేసినట్లుగా పేర్కొనడం గమనార్హం.
ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో సమావేశమయ్యారని , అందుకు తగిన సాక్షాలు ఉన్నాయని , అలాగే హైదరాబాద్ లోని కవిత ఇంట్లో కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి సమావేశాలు జరిగాయని పేర్కొంది. ఇండో స్పిరిట్స్ కు ఎల్ 1 కింద ఇచ్చిన షాపుల్లో 32 శాతం ఉందని ఈడీ పేర్కొనడం విశేషం. సమీర్ మహేంద్రు పై నమోదు చేసిన చార్జిషీట్ లో కవిత పేరు పేర్కొనడం గమనార్హం. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు మరిన్ని తలనొప్పులు ఖాయమని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.