ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న డిగ్గీ రాజా వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , జగ్గారెడ్డి , అంజన్ కుమార్ యాదవ్ , రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , షబ్బీర్ అలీ తదితర నాయకులతో కలిసి చర్చలు జరిపారు.
ఇక ఈరోజు ఉదయం నుండి వరుస భేటీలు నిర్వహిస్తూనే ఉన్నాడు డిగ్గీ రాజా. మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్ కు చేరుకొని అసంతృప్త నేతలతో వన్ బై వన్ మాట్లాడనున్నాడు. అందరితో చర్చించిన తర్వాత సాయంత్రం మీడియా ముందుకు రానున్నాడు. దిగ్విజయ్ సింగ్ గతంలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ గా పనిచేసిన అనుభవం ఉండటంతో దాదాపుగా కీలక నాయకులు అందరూ తెలుసు కాబట్టి సమస్య పరిష్కారం అవ్వడం ఖాయమని భావిస్తున్నారు.