సినీ నటి దివ్యవాణి బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిసింది. శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్ళింది దివ్యవాణి. ఈటల రాజేందర్ ను కలిసి పలు అంశాలపై చర్చించింది. అయితే ఏ ఏ అంశాల మీద ఇద్దరు చర్చించారు అన్నది తెలియరాలేదు కానీ దివ్యవాణి కూడా కొంత కాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటోంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన దివ్యవాణి జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే తెలుగుదేశం పార్టీలో తనకు అవమానాలు ఎదురు అవుతున్నాయని భావించి ఆ పార్టీకి రాజీనామా చేసింది. ఇక ఇప్పుడేమో ఈటల రాజేందర్ ను కలవడంతో బీజేపీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు.
Breaking News