నైజాం నవాబులను అలాగే రజాకార్లను ఎదురించి పోరాడి…… ఆ పోరాటంలో అమరుడైన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమురయ్య. ఈరోజు సెప్టెంబర్ 17 కావడంతో తెలంగాణ కోసం అసువులు బాసిన అమర వీరులను తల్చుకుంటున్నారు. వాళ్లలో మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమురయ్య. వరంగల్ జిల్లా కడవెండి గ్రామంలో జన్మించాడు.
సాధారణ కుటుంబంలో జన్మించిన దొడ్డి కొమురయ్య గొర్రెల కాపరి. అయితే కడవెండి లో దొర దురాగతాలను , అలాగే దొర తల్లి జానకమ్మ అరాచకాలను సహించలేక ఎదురు తిరిగి రజాకార్ల తూటాలకు బలైన మొట్టమొదటి అమరుడు. దొడ్డి కొమురయ్య మరణం తర్వాతనే తెలంగాణ సాయుధ పోరాటం తీవ్రమయ్యింది.
ఆ తర్వాత కొన్నాళ్ళకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చొరవతో సైనిక చర్య ఫలితంగా తెలంగాణ నైజాం నవాబు కబంధ హస్తాలనుండి బయటపడింది. దాంతో ఆ మహనీయుడి బయోపిక్ చేయాలనే తలంపుతో ఉన్నాడు గోరంట్ల సత్యం. ఈ కథను వెబ్ సిరీస్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు గోరంట్ల సత్యం.