వీకెండ్ కావడంతో మద్యం మత్తులో యువతులు కారు రాష్ గా డ్రైవింగ్ చేసి భారీ యాక్సిడెంట్ చేశారు. ఈ సంచలన సంఘటన హైదరాబాద్ మహా నగరంలోని నడిబొడ్డున జరిగింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఈ తెల్లవారు జామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దాంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భయానక వాతావరణం నెలకొంది. ఖరీదైన కారు కావడంతో సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో అందులో ఉన్న యువతులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే యాక్సిడెంట్ చేశామన్న భయంతో అక్కడ నుండి నలుగురు యువతులు పారిపోయారు. కారు డివైడర్ ను ఢీకొనడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో క్రేన్ సహాయంతో కారును తొలగించారు పోలీసులు. కారు నెంబర్ ఆధారంగా కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు పోలీసులు.