హైదరాబాద్ మహానగరంలో ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. కరోనా కష్టకాలంలో దుర్గం చెరువు పై సర్వాంగ సుందరంగా కేబుల్ బ్రిడ్జి నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అంతకుముందు వరకు హైదరాబాద్ మహానగరంలో పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం తర్వాత మాత్రం ఇదే నెంబర్ వన్ పొజీషన్ లో నిలిచింది.
పెద్ద ఎత్తున నగర వాసులతో పాటుగా ఇతర ప్రాంతాల నుండి వస్తున్నవాళ్ళు కూడా కేబుల్ బ్రిడ్జి చూడటానికి వస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కేబుల్ బ్రిడ్జిని చూడటానికి వస్తుండటంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది ఈ ప్రాంతానికి. అయితే ఇదే సమయంలో ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణమై రెండేళ్లు మాత్రమే పూర్తయ్యింది. ఈలోగా 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
కేబుల్ బ్రిడ్జి చూడటానికి వస్తున్న వాళ్ళలా వస్తూ …… ఆ బ్రిడ్జి ఎక్కి చెరువు లోకి దూకుతున్నారు ……. ఆత్మహత్య చేసుకుంటున్నారు. దాంతో సంచలనంగా మారింది. కేబుల్ బ్రిడ్జి చూడటానికి వచ్చేవాళ్ళు ఎవరో ? దూకడానికి వచ్చేవాళ్ళు ఎవరో తెలియక పాపం ఇబ్బంది పడుతున్నారు పోలీసులు.